హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 14 నుంచి మలేషియా వేదికగా జరుగనున్న ఆసియా చాంపియన్షిప్లో ఆశీర్వాద్ పాల్గొననున్నాడు.
జూనియర్ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆశీర్వాద్.. శాలిబండ సైక్లింగ్ క్లబ్లో శిక్షణ పొందుతున్నాడు. వీఎన్ సింగ్ శిక్షణలో రాటు దేలిన ఆశీర్వాద్.. ఆసియా చాంపియన్షిప్లో సత్తాచాటాలని తెలంగాణ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు మల్లారెడ్డి, దత్తాత్రేయ ఆకాంక్షించారు.