హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ బాడీబిల్డర్స్ ఫిజిక్ స్పోర్ట్స్ అసోసియేషన్(టీబీబీపీఎస్ఏ)కొత్త కార్యవర్గం కొలువుదీరింది. ఆదివారం జరిగిన టీబీబీపీఎస్ఏ ఎన్నికల్లో కేసిడి సంపత్‌రెడ్డి చైర్మన్‌గా ఎంపికయ్యారు.
కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్(ఐబీబీఎఫ్) కు టీబీబీపీఎస్ఏ అనుబంధ సంఘంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో బాడీబిల్డింగ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చైర్మన్ సంపత్‌రెడ్డి పేర్కొన్నారు.