హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోవా వేదికగా జరుగుతున్న ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ లిఫ్టర్ తేజావత్ సుకన్యా భాయ్ కాంస్య పతకంతో మెరిసింది.
శుక్రవారం జరిగిన మహిళల 76కిలోల విభాగం ఫైనల్లో సుకన్య 100కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. ఇదే కేటగిరీలో సేజల్ మోనికర్ (మహారాష్ట్ర), వెనిజుల అన్నె (కర్ణాటక) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.