ODI World Cup 2023 : శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. దిల్షాన్ మధుషనక వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ(4) బౌల్డయ్యాడు. మొదటి బంతికి బౌండ్రీ బాదిన హిట్మ్యాన్ రెండో బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(9), శుభ్మన్ గిల్(0) ఆడుతున్నారు. మూడు ఓవర్లకు స్కోర్ .. 14/1.
టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఆరు విజయాలతో జోరుమీదున్న భారత్ ఏ మార్పు లేకుండా బరిలోకి దిగగా.. లంక ధనంజయ డిసిల్వా స్థానంలో దుషాన్ హేమంతను తీసుకుంది.