న్యూఢిల్లీ: టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషా..రానున్న దేశవాళీ టోర్నీకి పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాలి గాయంతో బాధపడుతున్న షా..ప్రస్తు తం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఈ యువ క్రికెటర్‌కు మరింత సమయం పట్టే అవకాశముం ది. ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా నార్తంప్టన్‌షైర్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ..మోకాలి గాయం బారిన పడ్డా డు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 143 సగటుతో 429 పరుగులు చేశాడు.