INDW vs SAW : సొంతగడ్డపై భారత మహిళల జట్టు (Team India) గర్జించింది. ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా (South Africa)పై జయభేరి మోగించింది. తొలి వన్డేలో ఓపెనర్ స్మృతి మంధాన(117) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. స్పిన్నర్ ఆశా శోభన(4/21) తిప్పేసింది.
భారీ ఛేదనలో మిగతా బౌలర్లు తలొక చేయి వేయడంతో ప్రత్యర్థిని 122 పరుగులకే కట్టడి చేసింది. దాంతో, చిన్నస్వామి స్టేడియంలో సఫారీలపై టీమిండియా 143 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ సేన మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
India complete a resounding win over South Africa in Bengaluru 🔥
They go up 1-0 in the three-match ODI series!#INDvSA | 🗒️: https://t.co/2TGzdbYYeI pic.twitter.com/Q7j6uNlLVd
— ICC (@ICC) June 16, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 రన్స్ కొట్టింది. ఓపెనర్ స్మృతి మంధాన(117) అద్బుత శతకంతో రాణించగా ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ(37), పూజా వస్త్రాకర్(31)లు వీరకొట్టుడు కొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 4 పరుగుల వద్దే రేణుకా సింగ్ తొలి వికెట్ తీసి సఫారీలను వణికించింది.
Smriti Mandhana, Asha Sobhana power India to a massive win in Bengaluru #INDvSA
👉 https://t.co/4rlRlxv6tZ pic.twitter.com/7ZgiVEyHG4
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2024
అయితే.. సునే లుస్(33), మరిజానే కాప్(24)లు కాసేపు ప్రతిఘటించారు. కానీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని ఆశా శోభన(4/21)కు అందించగా ఆమె ఈ జోడీని విడదీసింది. 72 వద్ద కాప్ ఔట్ అవడంతో సఫారీల వికెట్ల పతనం మొదలైంది. శోభన, దీప్తి శర్మ(2/10) స్పిన్ ఉచ్చు బిగించగా వచ్చినవాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు చేరారు. అయబొంగ ఖాకను శోభన ఔట్ చేయడంతో 122 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటయ్యింది.
టాస్ గెలిచిన భారత మహిళల జట్టుకు సఫారీ పేసర్ మసబత క్లాస్ ఆదిలోనే షాకిచ్చింది. డేంజరస్ ఓపెనర్ షెఫాలీ వర్మ(7) ను ఔట్ చేసి పర్యాటకు జట్టుకు బ్రేకిచ్చింది. ఆ కాసేపటికే దయలాన్ హేమలత(12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(10)లు డగౌట్‌కు చేరారు. 53 పరుగులకే మూడు వికెట్లు పడడంతో 150 లోపే టీమిండియా ఆలౌట్ అయ్యేలా కనిపించింది.
మంధాన(117)
కానీ, మంధాన పట్టు విడువలేదు. దీప్తి శర్మతో కలిసి కీలక భాగస్వాయ్యం నిర్మించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. అర్ధ శతకం తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఈ సొగసరి బ్యాటర్ ఏకంగా సెంచరీ కొట్టేసింది. 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగుల చేసిన మంధాన మసబత ఓవర్లో వెనుదిరిగింది. ఆమె ఔటయ్యాక పూజ వస్త్రాకర్(31 నాటౌట్) దంచి కొట్టింది. దాంతో, హర్మన్‌ప్రీత్ సేన సఫారీలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.