అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర యువతకు ( Youth ) వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) ఆరోపించారు. స్వామి వివేకానంద జయంతి , జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సోమవారం ట్విట్టర్ ( Twiteer ) వేదిక ద్వారా రెండేళ్ల కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యువత వల్లే దేశ భవిష్యత్ ఆధారపడిందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, యువత వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. గత 8 త్రైమాసికాలకు గానూ విద్యా దీవేన కింద రూ.4,900 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ప్రతి నెలా నిరుద్యోగ యువతకు రూ. 3 వేలు ఇంకా ప్రారంభించలేదని దుయ్యబట్టారు.
ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు ఆగిపోయిందని పేర్కొన్నారు. ఫీజు రియింబర్స్మెంట్ పెండింగ్లో ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం వివేకా సూక్తులైన అరైజ్, అవేక్, ఫెసిలిటేట్ను ఆచరించియువత లక్ష్యాలను సాధించేందుకు సహకారం అందించాలని సూచించారు.