ODI World Cup | వరల్డ్ కప్ -2023 టోర్నీలో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢిల్లీ వేదికగా తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 25 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ హైలేట్స్..!
ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్ చక్కదిద్దిన టీం ఇండియా సారధి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, సారధి రోహిత్ శర్మ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అవగాహనతో ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 35వ ఓవర్ లో అజ్మతుల్లా వేసిన ఐదో బంతిని రెండుగా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. చివరి బంతిని బౌండరీకి పంపి.. విజయ లక్ష్యాన్ని చేధించాడు.
35వ ఓవర్ లో అజ్మతుల్లా వేసిన బంతిని రెండుగా మార్చడంతో విరాట్ కోహ్లీ (51) తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
33వ ఓవర్ ముగిసే సమయానికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43, శ్రేయస్ అయ్యర్ 19 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు.
30 ఓవర్లు పూర్తయ్యే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ 37, శ్రేయాస్ అయ్యర్ ఏడు పరుగులతో ఉన్నారు.
టీం ఇండియా సారధి రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోర్ 131 పరుగుల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటి వరకూ సిక్సర్లతో రికార్డుల మోత మోగించాడు.
20 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా ఒక వికెట్ కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ రెండు పరుగులు, రోహిత్ శర్మ 108 పరుగులతో కొనసాగుతున్నారు.
మరో నాలుగు పరుగుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాల్సిన ఇషాన్ కిషాన్.. 19వ ఓవర్ లో రషీద్ ఖాన్ వేసిన నాలుగో బంతిని ఆడి ఇబ్రహీం జద్రాన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి వికెట్ భాగస్వామ్యానికి 156 పరుగులు జత చేశారు. ఔటయ్యే సమయానికి ఇషాన్ కిషన్ వ్యక్తిగత స్కోర్ 47.
18వ ఓవర్ ముగిసే సమయానికి ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచాడు.
18వ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో నాలుగు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి.
17 ఓవర్లు ముగిసే సరికి రోహిత్ శర్మ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 61 బంతుల్లో 95 పరుగులు చేశాడు. వాటిల్లో 11 ఫోర్లు, ఫోర్ సిక్సర్లు ఉన్నాయి. జట్టు స్కోర్ 140 పరుగులు.
273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చకచకా జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా 16 ఓవర్లు ముగిసే సమయానికి 135 పరుగులు చేసింది టీం ఇండియా.
15వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ లో టీం ఇండియా స్కోర్ 130 పరుగులకు చేరింది.
14వ ఓవర్ లో రోహిత్ శర్మ చెలరేగి పోయాడు. రోహిత్ రెండు ఫోర్లు, ఇషాన్ కిషాన్ ఒక ఫోర్ తో సరిపెట్టుకున్నారు.
ఎం నబీ వేసిన 13వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ తొలి బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ వద్ద బౌండరీకి పంపాడు. ఐదో బంతిని మిడిల్ మీదుగా స్టాండ్స్ కు పంపాడు.
12వ ఓవర్ లో ముజీబ్ వేసిన నాలుగో బంతిని ఆడిన రోహిత్ శర్మ సింగిల్ తీయడంతో టీం ఇండియా స్కోర్ 100 దాటింది.
11వ ఓవర్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ చెరో సింగిల్ తీశారు. ఇప్పటి వరకు భారత్ స్కోర్ 96 పరుగులు.
తొలుత ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేసిన టీం ఇండియా.. బ్యాటింగ్ లోనూ దూసుకెళ్తున్నది. ప్రత్యేకించి సారధి రోహిత్ శర్మ ఓవర్ కో బౌండరీ.. సిక్సర్‌తో జట్టు స్కోర్ చకచకా పెంచుతూ ముందుకు సాగుతున్నాడు. తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి టీం ఇండియా సారధి 87 పరుగులు. పది ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ 94కు చేరింది. ముజీబ్ వేసిన 10వ ఓవర్ లో ఆచితూచి ఆడిన రోహిత్ శర్మ చివరి బంతిని బౌండరీకి పంపి శిక్షించాడు.
ఎనిమిదో ఓవర్ లో నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో బంతిని పెవిలియన్ దారి పట్టించడంతో రోహిత్ శర్మ (53) తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
నవీన్ హక్ బౌలింగ్‌లో పరుగుల వరద పారుతున్నది. ఆరో ఓవర్ లో ఇసాన్ కిషాన్ రెండు బౌండరీల మళ్లించాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ చెరో ఫోర్ పొందారు. ఆరో ఓవర్ లో పది పరుగులు పొందింది భారత్. ఫరూఖ్ ఫజల్లాక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతూ మరోవైపు బౌండరీలు, స్టాండ్లపైకి బంతిని పంపించారు ఇషాన్ కిషాన్. ఫలితంగా ఏడో ఓవర్లో వన్డేల్లో 656 సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ శర్మ సొంతమైంది. ఏడో ఓవర్ లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో రోహిత్ శర్మ అదరగొట్టాడు.
273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి
ఎటువంటి వికెట్లు కోల్పోకుండానే 37 పరుగులు పూర్తి చేసింది. అంతకు ముందు తొలి ఓవర్లో రెండు పరుగులకే పరిమితమైంది టీం ఇండియా. ముజ్బీర్ రెహ్మాన్ వేసిన రెండో ఓవర్ లో ఐదు పరుగులొచ్చాయి. మూడో ఓవర్ రెండో బంతిని స్క్వేర్ లెగ్ ద్వారా క్లిప్ చేసి బౌండరీకి మళ్లించాడు రోహిత్ శర్మ.
తదుపరి జట్టు స్కోర్ 198 పాయింట్లకు చేరుకున్నది. ముజీబ్ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతిని స్క్వేర్ ఆన్ మీదుగా డీప్ స్క్వేర్ లెగ్ నుంచి బౌండరీకి మళ్లించాడు ఇషాన్ కిషాన్. ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి మళ్లించడంతో జట్టు స్కోర్ 23 పరుగులు.
273 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీం ఇండియా.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేపట్టారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెంటవెంటనే రెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ తో జాగ్రత్తగా ఆడుతున్నట్లు కనిపిస్తున్నది.
టీంఇండియా, ఆప్ఘన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో టీం ఇండియా ముందు ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. తొలుత భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. పొదుపుగా పరుగులు ఇచ్చినా.. తర్వాతర్వాత ఆఫ్ఘన్ బ్యాట్స్ మన్లు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, స్టాండ్స్ వైపు మళ్లిస్తూ.. సింగిల్స్ తీస్తూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. ప్రత్యేకించి ఆఫ్ఘన్ సారధి హస్మతుల్లా షాహిద్.. అజ్మతుల్లా ఒమర్ జాయితో కలిసి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జత చేశారు. 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటైనా హజ్మతుల్లా షాహిద్ పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
జస్ప్రీత్ బుమ్రా వేసిన 49వ ఓవర్ తొలి బంతిని కొట్టిన రషీద్ ఖాన్.. ఆ బంతిని కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 261 పరగులు చేసింది.
48వ ఓవర్ లో సిరాజ్ వేసిన మూడో బంతిని రషీద్ ఖాన్ బ్యాక్ వర్డ్ పాయింట్ గ్యాప్ ద్వారా బౌండరీకి పంపాడు. అటుపై వేసిన బంతిని నేరుగా స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో ఏకంగా 48వ ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి. 47వ ఓవర్ లో జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండు బంతులను ముజీబ్ బౌండరీకి మళ్లించాడు. దీంతో తొమ్మిది పరుగులు వచ్చాయి. అంతకుముందు 46వ ఓవర్ లో రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి.
జస్ప్రీత్ బుమ్రా వేసిన 45వ ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. 45వ ఓవర్ రెండో బంతిని డీప్ కవర్ పాయింట్ మీదుగా జర్దాన్ పంపితే.. కోహ్లీ బ్రెడ్ బాస్కెట్ క్యాచ్ పట్టడంతో ఆఫ్ఘన్ ఆరో వికెట్ కోల్పోయింది. చివరి బంతి ఆడబోయిన ఎం నబీ ఎల్బీడబ్ల్యూ అని తేలడంతో పెవిలియన్ బాట పట్టాడు. అంతకు ముందు బంతిని లెంథ్ ఔట్ సైడ్ ఆఫ్ మీదుగా బౌండరీ బాట పట్టించాడు. దీంతో జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.
43వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్ వేసిన నాలుగో బంతిని రివర్స్ కొట్టేందుకు ఆఫ్ఘన్ సారధి హజ్మతుల్లా షాహిద్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా ఎల్బీడబ్ల్యూ అని తేలడంతో పెవిలియన్ బాట పట్టాడు. 43 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘన్ ఐదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.
42వ ఓవర్ లో సిరాజ్ వేసిన చివరి బంతిని పెవిలియన్ వైపు మళ్లించాడు హస్మతుల్లా షాహీద్. ఎంబీ నబీ సింగిల్, హస్మతుల్లా షాహిద్ రెండు , రెండు సింగిల్స్ తీశాడు. దీంతో జట్టుకు 42వ ఓవర్ లో పది పరుగులు వచ్చాయి.
వీలు చిక్కినప్పుడు బంతిని బౌండరీకి మళ్లిస్తూ.. సింగిల్స్ తో స్కోర్ పెంచుతున్న ఆప్ఘన్ సారధి హజ్మతుల్లా షాహిద్ ను కట్టడి చేయడానికి కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. తదనుగుణంగా మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అజ్మతుల్లాతో.. తర్వాత ఎం నబీతో కలిసి జట్టు స్కోర్ క్రమంగా పెంచుతున్న ఆప్ఘన్ సారధి హజ్మతుల్లా సాహిదీ సింగిల్స్ తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. 40వ ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతిని మిడ్ వికెట్ మీదుగా పెవిలియన్ బాట పట్టించాడు. అంతకుముందు 39వ ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ పొదుపుగా పరుగులు ఇచ్చాడు. కేవలం ఒక్క సింగిల్ మాత్రమే పరుగు తీశాడు హాజ్మతుల్లా షాహిదీ. ఫోర్ తోపాటు ఒక సింగిల్, ఎం నబీ రెండు పరుగులు చేశారు. దీంతో 40 ఓవర్లకు ఆప్ఘనిస్థాన్ స్కోర్ నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులకు చేరింది. హజ్మతుల్లా 70 పరుగులు, ఎం నబీ 9 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు.
ఆప్ఘనిస్థాన్ సారధి హస్మతుల్లా సారధి జట్టు స్కోర్ పెంచడానికి నిలకడగా ఆడుతున్నాడు. ఎం నబీతో కలిసి సింగిల్స్ తీస్తున్నాడు. హార్దిక్ పాండ్యా వేసిన 37 ఓవర్లో ఐదు సింగిల్స్ తీశారు. రెండు వైడ్స్ వచ్చాయి. దీంతో జట్టు స్కోర్ నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులకు చేరుకున్నది.
అజ్మతుల్లా ఒమర్ జాయి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఎం నబీతో కలిసి జట్టు సారధి హస్మతుల్లా సాహిదీ సింగిల్స్ తీశారు. ఎం నబీ రెండు, హస్మతుల్లా మూడు సింగిల్స్ తీశారు.
35వ ఓవర్ లో హార్దిక్ పాండ్యా తొలి బంతిని బౌండరీ బాట పట్టించిన అజ్మతుల్లా ఒమర్జాయి.. రెండో బంతిని నేరుగా హార్దిక్ పాండ్యాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన ఎం నబీ సింగిల్ తీశాడు. చివరి బంతిని హస్మతుల్లా షాహిదీ బౌండరీకి మళ్లించాడు. అప్పటికి ఆఫ్ఘనిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్యా వేసిన 35 వ ఓవర్ లో రెండు బంతిని ఆడిన అజ్మతుల్లా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. స్లో బాల్ కొట్టబోయి నేరుగా హార్దిక్ పాండ్యాకే చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి అజ్మతుల్లా ఒమర్ జాయి వ్యక్తిగత స్కోర్ 62 పరుగులు.
హార్దిక్ పాండ్యా వేసిన 33వ ఓవర్ లో హస్మతుల్లా చెలరేగిపోయాడు. ఒక బంతిని స్టాండ్స్ లోకి.. మరొక బంతిని బౌండరీ బాట పట్టించాడు. అంతకుముందు 32 ఓవర్ నాలుగో బంతి ముగిసే సరికి వీరిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. 33 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు మూడు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
32 ఓవర్ లో సిరాజ్ వేసిన మూడో బంతిని హస్మతుల్లా మరోమారి బౌండరీ బాట పట్టించాడు. హస్మతుల్లా మూడు పరుగులు, అజ్మతుల్లా సింగిల్ తీయడంతో అజ్మతుల్లా 50 పరుగులతో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు.
31వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన చివరి బంతిని హస్మతుల్లా బౌండరీ బాట పట్టించాడు. అంతకుముందు హస్మతుల్లా షాహిది, అజ్ముతుల్లా చెరో సింగిల్ చేశారు. మొత్తం ఓవర్లు ఆరు పరుగులు రాబట్టారు.
భారత్ బౌలర్లు తొలుత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. క్రమంగా ఆఫ్ఘన్ బ్యాటర్లు పుంజుకుంటున్నారు. బౌండరీలతో మెరిపిస్తూ.. బంతిని అప్పుడప్పుడు స్టాండ్స్ లోకి పంపుతున్నారు. 30 ఓవర్ సిరాజ్ బౌలింగ్ లో అజ్మతుల్లా, హస్మతుల్లా చెరొకసారి బంతిని బౌండరీ బాట పట్టారు. అజ్మతుల్లా సింగిల్, హస్మతుల్లా ఒక సింగిల్ తీశారు. దీంతో 30 ఓవర్లు ముగిసే సమయానికి పది పరుగులు జోడించారు అజ్మతుల్లా, హస్మతుల్లా.. జట్టు మూడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
28 ఓవర్లు ముగిసే సరికి ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లు 12 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్ బౌలింగ్‌లో రెండో బంతిని స్టాండ్స్ లోకి పంపాడు అజ్మతుల్లా.. అటుపై అజ్మతుల్లా నాలుగు పరుగులు, హస్మతుల్లా సింగిల్ తీశారు.
ODI World Cup | వరల్డ్ కప్ -2023 టోర్నీలో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢిల్లీ వేదికగా తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 25 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ హైలేట్స్..!