T20 World Cup 2024 | ఎన్సీఏలో టీమిండియా.. వరల్డ్ కప్ సన్నద్ధత షురూ
T20 World Cup 2024 : వరల్డ్ కప్ కోసం భారత జట్టు మహిళల జట్టు సన్నద్ధం కానుంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన పది రోజుల క్యాంప్‌లో పాల్గొననుంది.
T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 25 రోజుల్లో యూఏఈ(UAE) వేదికగా ప్రపంచ కప్ జాతర జరుగనుంది. దాంతో.. భారత జట్టు మహిళల జట్టు వరల్డ్ కప్(T20 World Cup 2024) కోసం సన్నద్ధం కానుంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన పది రోజుల క్యాంప్‌లో పాల్గొననుంది. హెడ్‌కోచ్ అమొల్ ముజుందార్(Amol Muzumdar) పర్యవేక్షణలో భారత జట్టు మెలకువలకు పదును పెట్టనుంది.
ఆసియా కప్ ఫైనల్లో అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడిన భారత అమ్మాయిలు వరల్డ్ కప్ ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే 15 మందితో కూడిన స్క్వాడ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక మిగిలిందల్లా ప్రాక్టీస్ మాత్రమే. అందుకని జాతీయ క్రికెట్ అకాడమీలో హర్మన్‌ప్రీత్ బృందం సెప్టెంబర్ 10, మంగళవారం నుంచి 10 రోజుల క్యాంప్‌లో వ్యూహాలు, గేమ్ ప్లాన్‌పై ఓ అవగాహనకు రానుంది.
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 🗓️#TeamIndia‘s schedule for the ICC Women’s #T20WorldCup 2024 is 𝙃𝙀𝙍𝙀 🔽 pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
ఈ క్యాంప్‌లో వరల్డ్ కప్ స్క్వాడ్‌లోని 15 మందితో పాటు రిజ్వర్ ప్లేయర్లు కూడా పాల్గొననున్నారు. ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొన్న యస్తికా భాటియా(Yastika Bhatia), ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్(Shreyanka Patil)లకు ఎన్ఓసీ లభించింది. దాంతో, వాళ్లు సైతం ఎన్సీఏకు వస్తారని సమాచారం. 10 రోజుల క్యాంప్ పూర్తయ్యాక భారత బృందం సెప్టెంబర్ 24న యూఏఈ విమానం ఎక్కనుంది.
శ్రేయాంక పాటిల్, యస్తికా భాటియా

రెండు వామప్ మ్యాచ్‌లు
వరల్డ్ కప్ ముందు టీమిండియా రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 29వ వెస్టిండీస్‌తో, అక్టోబర్1న దక్షిణాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. అనంతరం అక్టోబర్ 4న జరిగే తొలి లీగ్ దశ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఢీకొననుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 13న టీమిండియా తాడోపేడో తేల్చకోనుంది. లీగ్ దశలో భారత జట్టు ఆడే నాలుగు మ్యాచుల్లో మూడూ దుబాయ్ వేదికా జరుగనున్నాయి.
భారత స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధానా(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, దయలాన్ హేమలత, ఆషా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన సంజీవన్.
ట్రావెలింగ్ రిజర్వ్స్ : ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్), తనుజా కన్వర్, సైమా థాకొర్.
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ : రఘ్వీ బిస్త్, ప్రియా మిశ్రా.
ఇవి కూడా చదవండి
- Vinayaka Chavithi | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పూజ
- KTR | పేరుకేమో ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు.. కేటీఆర్ ఫైర్
- AP Rains | విశాఖను వణికిస్తున్న వర్షాలు.. ఆ నాలుగు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
- Telangana | 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- Women’s Delhi Premier League | శతక్కొట్టిన ఉపాసన.. తొలి సీజన్ విజేతగా నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

