Vinayaka Chavithi | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పూజ
Vinayaka Chavithi | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బాల వినాయక పూజను నిర్వహించారు. శనివారం జూమ్ కాల్లో నిర్వహించిన ఈ పూజలో భక్తులు కుటుంబసమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు.
Vinayaka Chavithi | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బాల వినాయక పూజను నిర్వహించారు. శనివారం జూమ్ కాల్లో నిర్వహించిన ఈ పూజలో భక్తులు కుటుంబసమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలగి అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని ప్రార్థించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ జూమ్ కాల్లో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోశ్‌కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, భాస్కర్ గుప్తా నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ , కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోశ్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Tcss2
అందరిపై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ APAS బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మకుట డెవలపర్స్ , జీఆర్టీ అర్ట్లాండ్స్ , లైవ్ స్పేస్ ఇంటీరియర్ & రేనోవేషన్స్ , SVS శ్రీవసుధ ట్రూ వెల్త్ ఇండియా మరియు ఎవోల్వ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

