KTR | హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించిన కేటీఆర్.. ఓ వీడియోను షేర్ చేశారు.
హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు వద్ద పేదల ఇల్లు కూలగొట్టి సామాను బయటపడేయడంతో వర్షంలో తడుస్తూ రేకులు అడ్డం పెట్టుకుని నిరుపేదల తలదాచుకున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలాంటి హృదయ విదారక ఘటనలను చూసే పరిస్థితి రాదని అన్నారు. మానవ పునరావాస విధానాలతో బయటకు రావాలని.. ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
ఇవ్వాళ రేవంత్ సర్కార్ కూల్చిన ఇళ్లలోని నిరుపేదలు వీరు
జోరు వానలో
కనికరం లేని సర్కారు
కర్కశంగా గూడు కూల్చేస్తే
దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో
తలదాచుకుంటున్న అభాగ్యులు.పేరుకేమో ప్రజా ప్రభుత్వం.
కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు!About 40,000 Double Bedroom houses that have been… pic.twitter.com/TqBktAnKuX
— KTR (@KTRBRS) September 8, 2024