ఢిల్లీ : పేరుమోసిన ఆటో దొంగ మనోజ్ బక్కర్వాలా(Ashish Bakkarwala) కుమారుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆశిష్ బక్కర్ వాలాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఔటర్ ఢిల్లీలోని బక్కర్వాలా రూట్ ప్రాంతంలో ఔటర్ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సిబ్బంది ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. ఇరువైపులా రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌం టర్ అనంతరం, ఆశిష్ బక్కర్వాలాను అరెస్టు చేశారు. అతనిపై ఎనిమిదికి పైగా కేసులు నమోదయ్యాయి. నిందితుడు నాలుగు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు.
నిన్న రాత్రి ఆశిష్ బక్కర్వాలా తన స్వగ్రామం బక్కర్వాలాకు వెళ్తున్నాడని ఔటర్ డిస్ట్రిక్ట్ స్పెషల్ స్టాఫ్‌కు సమాచారం అందింది. దీంతో స్పెషల్ స్టాఫ్ బృందం వల పన్ని అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిం చింది. ఆశీష్ పోలీసుల సమీపంలోనే ఉండటంతో గుర్తించి వెంటనే లొంగిపొమ్మని కోరారు. దీంతో ఆశీష్ పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు.
ప్రతిగా పోలీసులు కూడా రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన ఆశిష్‌ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి ఒక అక్రమ సెమీ-ఆటోమేటిక్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను హిమాన్షు భావు గ్యాంగ్‌తో కలిసి పనిచేస్తున్నాడు. నిందితుడిపై 8పైగా కేసులు నమోదై ఉన్నాయి.