Ram Charan | పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్.. సీఎం విజయ్‌పై ప్రశంసలు, వైరల్‌గా మారిన కామెంట్స్
Ram Charan | పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
Ram Charan | పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఈ క్రమంలో మే 30న చెన్నైలో నిర్వహించిన ‘పెద్ది’ ప్రెస్‌మీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్ననాటి నుంచి చెన్నైతో అనుబంధం ఉన్న రామ్ చరణ్, అక్కడి మీడియా ప్రతినిధులు, అభిమానులతో ఎక్కువ భాగం తమిళంలోనే మాట్లాడారు. దీంతో అక్కడి అభిమానులు చరణ్ ప్రసంగానికి ఫిదా అయ్యారు.
అయితే ఈ కార్యక్రమంలో సినిమా విషయాల కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలే. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు చరణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, “తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ సర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక స్టార్ హీరోగా కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో ప్రజా సేవ కోసం సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావడం గొప్ప నిర్ణయం. ఒక సినిమా వ్యక్తిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నాకు గర్వంగా అనిపిస్తోంది. తమిళనాడు ప్రజలకు, విజయ్ సర్‌కు నా అభినందనలు” అని అన్నారు.
రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు ఈ వీడియో క్లిప్‌లను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. చరణ్ చూపిన గౌరవం, విజయ్‌పై చేసిన ప్రశంసలు రెండు రాష్ట్రాల అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా, ‘పెద్ది’ సినిమాపై తమిళనాడులో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్‌కు అక్కడ మంచి మార్కెట్ ఉండటంతో పాటు, చిత్ర బృందం నిర్వహిస్తున్న ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా విశేష స్పందన లభిస్తోంది. చెన్నై ప్రెస్మీట్లో అభిమానుల నుంచి వచ్చిన స్పందన కూడా సినిమాపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబించింది. మరోవైపు తమిళనాడులో ఇటీవల విడుదలవుతున్న భారీ చిత్రాలకు అదనపు షోలకు అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో ‘పెద్ది’కి కూడా ప్రత్యేక షోలకు అనుమతులు లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం తమిళ మార్కెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

