Asia Cup : ఆసియా కప్ ముందు భారత జట్టు(Team India)కు కొత్త సమస్య వచ్చి పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం కారణంగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ (Jersey Sponser)ను కోల్పోయింది. ఆన్లైన్ గేమింగ్ (Online Gaming) నియంత్రణ చట్టం రాకతో జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11తో చేసుకున్న ఒప్పందం రద్దవ్వడమే అందుకు కారణం. ఆసియా కప్ ప్రారంభానికి ఇంకా తొమ్మది రోజులే ఉన్నందున ఇప్పటికిప్పుడు కొత్త స్పాన్సర్‌ను వెతకడం కష్టమైన పనే. సో.. ఈసారికి జెర్సీ స్పాన్సర్ లేకుండానే టీమిండియా మెగా టోర్నీలో ఆడనుంది.
కొత్త జెర్సీ స్పాన్సర్‌పై చర్చించేందుకు గురువారం రాజీవ్ శుక్లా నేతృత్వంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో కొత్త స్పాన్సర్ ఎంపిక.. సాధ్యాసాధ్యాల గురించిన ప్రస్తావన వచ్చింది. అయితే ఆసియా కప్ సమీపిస్తున్నందునపు బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేయడం.. ఒప్పందం కుదుర్చుకోవడం దాదాపు అసాధ్యమని భావించారు అధికారులు. మెగా టోర్నీ తర్వాత స్పాన్సర్‌ను ఖరారు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్ కప్‌లోపు జెర్సీ స్పాన్సర్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
It’s officially thriller time, because Team India is back on the pitch! 💥
Go make your Dream11 team now! 💪#Dream11 #IndvEng #JaspritBumrah #RishhabhPant pic.twitter.com/VScNFP6D7V
— Dream11 (@Dream11) June 20, 2025
బీసీసీఐకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధిస్తూ చట్టం తేవడంతో భారత బోర్డు ఆదాయానికి భారీగా గండి పడనుంది. జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11, ఐపీఎల్ జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న my11circle కంపెనీలతో బీసీసీఐ తెగతెంపులు చేసుకుంది. ఈ పరిణామం ఆర్ధికంగా భారత బోర్డుకు భారీ నష్టమనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ రెండు సంస్థల నుంచి బీసీసీఐ రూ. 1,000 కోట్ల ఆదాయం సమకూరేది. కానీ, ఆన్లైన్ గేమింగ్ చట్టంతో డ్రీమ్ 11 కంపెనీ టీమిండియా స్పాన్సర్‌గా మూడేళ్ల కాలానికి (2023-26) బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.358 కోట్ల ఒప్పందం రద్దు అయింది.
🚨 A look at #TeamIndia‘s squad for #AsiaCup 2025 🔽 pic.twitter.com/3VppXYQ5SO
— BCCI (@BCCI) August 19, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో భారత్ ఫేవరెట్‌గా ఆడనుంది. ఇప్పటివరకూ ఎనిమిది సార్లు (ఏడుసార్లు వన్డే ఫార్మాట్లో, ఒకసారి టీ20 ఫార్మాట్లో) ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా తొమ్మిదో ట్రోఫీపై గురి పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా బృందం సెప్టెంబర్ 4న దుబాయ్‌కు చేరుకోనుంది. తొలి పోరులో భాగంగా ఆతిథ్య యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్థాన్ జట్టును, సెప్టెంబర్ 19న పసికూన ఒమన్ టీమ్‌ను టీమిండియా ఢీకొట్టనుంది.