Team India | శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించేది ఎప్పుడు..? టీ20 కెప్టెన్ ఎవరన్నదానిపైనే పేచీ..!
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్‌కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో వాయిదాపడినట్లు తెలుస్తున్నది.
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్‌కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో వాయిదాపడినట్లు తెలుస్తున్నది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా ఈ ఫార్మాట్లో భారత కెప్టెన్ ఎవరు? అనే విషయంపై చాలారోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు వినిపించింది.
తాజాగా సూర్యకుమార్ పేరు తెరపైకి వచ్చింది. కెప్టెన్ ఎంపిక విషయంలోనే స్పష్టత లేకపోవడంతో జట్టు ప్రకటనలో ఆలస్యం జరుగుతుందనే వాదనలున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ గాయపడగా.. దాని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఇంకా గాయ సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో బీసీసీఐ, టీం మేనేజ్మెంట్ పొట్టి ఫార్మాట్‌కు పాండ్యాను రెగ్యులర్ కెప్టెన్‌గా నియమించేందుకు వెనుకాడుతున్నది. తాజాగా హెడ్‌కోచ్‌గా నియామకమైన గౌతమ్ గంభీర్ సైతం సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది.
సాధారణంగా రోహిత్ అందుబాటులోని లేని సమయంలో టీ20లకు కెప్టెన్‌గా నాయకత్వం వహించేవాడు. టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే వరల్డ్ కప్‌లో హార్దిక్ గాయపడిన సమయంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫిక్రాతో మ్యాచులకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా.. గంభీర్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా వీడియోకాల్‌లో సమావేశం అయ్యారని.. ఇద్దరూ శ్రీలంక పర్యటనపై చర్చించారని సమాచారం. టీ20 కెప్టెన్ ఎవరు ? అనే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గంభీర్ సూర్యకుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని కోరుతున్నాడని, హార్దిక్‌కు జై షా మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రోహిత్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు లంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అయితే, రోహిత్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో హార్దిక్ దూరమవునున్నట్లు సమాచారం. మరికొద్దిరోజుల్లోనే లంక పర్యటన ఉండగా.. ప్రస్తుతం జట్టును ఎప్పుడు ప్రకటిస్తారా? అనే ఆసక్తి నెలకొన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

