Team India Stars : కొత్త ఏడాది రోజున భారత మహిళా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాలేశ్వరుడి (Ujjain Mahakaleshwar)ని దర్శించుకున్నారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డిలు గురువారం ఇక్కడి ప్రసిద్ధ జ్యోతిర్లింగానికి పూజలు చేసి శివయ్య అనుగ్రహం పొందారు. ‘భస్మ హారతి’ (Bhasm Aarti)లో పాల్గొన్న టీమిండియా స్టార్లు ఈ ఏడాది తమకు అన్నీ శుభాలే కలగాలని దైవాన్ని ప్రార్ధించారు. అనంతరం ఆలయ పూజారి భారత క్రికెటర్లకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ను ఒడిసిపట్టి చరిత్ర సృష్టించిన టీమిండియా పొట్టి సిరీస్‌లో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. విశ్వ విజేతగా తొలి సిరీస్‌ను అజేయంగా ముగించిన భారత జట్టు 2025కు ఘనంగా వీడ్కోలు పలికింది. తదుపరి టీ20 ప్రపంచకప్ లక్ష్యం సాగుతున్న భారత క్రికెటర్లు కొత్త ఏడాది రోజున దైవదర్శనంతో తన్మయం చెందారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాలేశ్వరుడి ఆలయాన్ని స్మృతి మంధానతో కూడిన బృందం దర్శించుకుంది. మంధానతో పాటు రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, స్నేహ్ రానా ఉన్నారు.
#WATCH | Ujjain, MP | Members of the Indian Women’s Cricket Team offer prayers at the at Mahakaleshwar Temple on the first day of #NewYear2026 pic.twitter.com/5CEv1ksHhJ
— ANI (@ANI) January 1, 2026