బెంగళూరు: టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బుమ్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఎన్సీఏలో పునరావాసం పొందుతున్న బుమ్రా మంగళవారం తొలిసారి నెట్స్‌లో పాల్గొన్నాడు.