Mukesh Kumar | టీ20 సిరీస్ మధ్యలో వివాహం.. ఇన్‌స్టాలో ఫొటోలు పెట్టిన భారత పేసర్
Mukesh Kumar : ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భారత యువ పేసర్ ముకేష్ కుమార్(Mukesh Kumar) అదరగొట్టాడు. జూనియర్ షమీగా ప్రశంసలు అందుకున్న ఈ స్పీడ్‌స్టర్ తాజాగా తన పెండ్లి వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెండ్లి చేసుకోవడం కోసం మూడో టీ20కి దూరమైన అతడు ఆ...
Mukesh Kumar : ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భారత యువ పేసర్ ముకేష్ కుమార్(Mukesh Kumar) అదరగొట్టాడు. జూనియర్ షమీగా ప్రశంసలు అందుకున్న ఈ స్పీడ్‌స్టర్ తాజాగా తన పెండ్లి వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెండ్లి చేసుకోవడం కోసం మూడో టీ20కి దూరమైన అతడు ఆ తర్వాత జట్టుతో కలిసిన విషయం తెలిసిందే.
ముకేష్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దివ్యా సింగ్(Divya Singh)ను వివాహం చేసుకున్నాడు. తమ కల్యాణ మహోత్సవ ఫొటోలను అభిమానులతో పంచుకున్న అతడు వాటికి.. ‘ఎల్లప్పుడూ నేను నీవాడినే. నువ్వు నాదానివే’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఆ ఫొటో చూసిన టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ముకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.
రంజీల్లో బెంగాల్ తరఫున తన పేస్ పవర్ చూపించిన ముకేష్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో అద్భుతంగా రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ప్రాతినిధ్యం వహించిన ఈ స్పీడ్‌స్టర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ ముకేష్ వెస్టిండీస్ పర్యటన(West indies Tour)తో భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకున్న ముకేష్ ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో దుమ్మురేపాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా రాణిస్తూ మాజీల ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ముకేష్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Uttam Kumar Reddy | ఢిల్లీలో ప్రత్యక్షమైన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎందుకు వెళ్లారంటే?
-
Telangana | సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఖర్గే కీలక ప్రకటన
-
Michaung Cyclone | బాపట్ల దగ్గర తీరం తాకిన మిగ్జాం తుఫాను.. 11 జిల్లాల్లో భారీ వర్షం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

