సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. కానీ భారత్ టెస్టు జట్టులో చూస్తే ఏడుగురు యువఆటగాళ్లు మొదటిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడబోతున్నారు. వీరిలో అయిదుగురు ఆటతీరు ఇప్పటివరకు బాగున్నా వారు సౌతాఫ్రికా పిచ్‌లపై తమని తాము నిరూపించుకోవాల్సి ఉంది.
కాగా.. ఈ టెస్టు సిరీస్‌కు కోచ్‌గా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. కానీ అతనికి కూడా గతంలో సౌతాఫ్రికా గ్రౌండ్లలో ఆడేందుకు కష్టంగా అనిపించేది. ఇంకా చెప్పాలంటే.. టెస్టు టీం కెప్టన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహాణె, చతేశ్వర్ పుజారా లాంటి వాళ్లైతే గత కొంత కాలంగా తమ బ్యాటింగ్‌తో పెద్దగా మెప్పించలేకపోయారు.
ఇలాంటి తరుణంలో టీమిండియా టెస్టు జట్టు ఆటతీరు ప్రస్తుతం అయిదుగురు యువగాళ్లపైనే ఆధారపడి ఉంది. వారే శ్రేయస్ అయ్యార్, మయంక్ అగర్వాల్, మొహమ్మద్ సిరజ్, శార్దూల్ ఠాకుర్, రుషభ్ పంత్.
వీరిలో రుషభ్ పంత్ ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్‌ల్లో 1549 పరుగులు బాదాడు. అందులో 7 హాఫ్ సెంచురీలు, 3 సెంచురీలు అతని అత్యుతమ స్కోరు 159 రన్స్ నాటౌట్. 2018లొ పంత్ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు సౌతాఫ్రికా గడ్డపై మొదటిసారి ఆడబోతున్నాడు.
అలాగే శార్దూల్ ఠాకుర్ కేవలం నాలుగు టెస్టు మ్యాచుల్లో 190 రన్లు కొట్టి, 14 వికెట్లు తీసి ఒక ఆల్ రౌండర్‌గా నిరూపించుకున్నాడు. టెస్టు మ్యాచు్ల్లో బౌలర్‌గా అతని బెస్ట్ 61 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మరో ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ పది టెస్టు మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు తీశాడు. అతని బెస్టె 73 పరుగులకు 5 వికెట్లు.
ఈ వరుసలో మయాంక్ అగర్వాల్ యువబ్యాట్స్ మెన్‌గా మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఆడిన మొత్తం 16 మ్యాచ్‌లలో 1294 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచురీలు, 4 హాఫ్ సెంచురీలుండడం విశేషం. ఇటీవల జరిగిన ముంబై టెస్టులో న్యూజిల్యాండ్‌కు వ్యతిరేకంగా మయాంక్ 150 పరుగులు బాది అందరి దృష్టిని ఆకట్టుకన్నాడు. చివరగా శ్రేయస్ అయ్యర్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి 202 రన్స్ కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇటీవల జరిగిన కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌కు వ్యతిరేకంగా కేవలం 159 బాల్స్‌లో సెంచరీ కొట్టాడు.
సౌతాఫ్రికా గడ్డపై ప్రస్తుతం టెస్టు సిరీస్ గెలవాలంటే సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడంతో ఈ అయిదుగురు యువగాళ్లు తప్పక రాణించాల్సిన పరిస్థితి ఉంది.