New Jersey | టీ20 వరల్డ్ కప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..! సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
New Jersey | జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవబోతున్నది. ఈ మెగా టోర్నీకి తొలిసారిగా వెస్టిండిస్‌తో కలిసి అమెరికా అతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే అమెరికాకు చేరుకున్నది. పొట్టి వరల్డ్ కప్‌లో టీమిండియా కొత్త జెర్సీలతో బరిలోకి దిగబోతున్నది. కొత్త జెర్సీల్లో ఆటగాళ్లు మెరిసిపోయారు.
New Jersey | జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవబోతున్నది. ఈ మెగా టోర్నీకి తొలిసారిగా వెస్టిండిస్‌తో కలిసి అమెరికా అతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే అమెరికాకు చేరుకున్నది. పొట్టి వరల్డ్ కప్‌లో టీమిండియా కొత్త జెర్సీలతో బరిలోకి దిగబోతున్నది. కొత్త జెర్సీల్లో ఆటగాళ్లు మెరిసిపోయారు. ఈ మేరకు కొత్త జెర్సీలకు సంబంధించిన ఫొటోషూట్ని ఐసీసీ విడుదల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
జెర్సీలో భుజాలు, చేతులపై కాషాయ రంగు, వాటిపై తెల్లని చారలు, మిగతా అంతా బ్లూ కలర్లోనే ఉన్నది. టీమిండియా ఆటగాళ్లు 2019 వరల్డ్ కప్ సమయంలోనూ దాదాపు ఇదే తరహాలో ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా వేర్వేరు జెర్సీలు ధరిస్తూ వస్తోంది. ఈసారైనా కొత్త జెర్సీ లక్ తెస్తుందేమో చూడాలి. 2011 తర్వాత టీమిండియా ఏ ఐసీసీ ఈవెంట్లో నెగ్గలేదు. ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనున్నది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనున్నది.
The Indian team is fired up for the ICC Men’s #T20WorldCup 2024 🇮🇳🔥 pic.twitter.com/W8e93iMl5c
— ICC (@ICC) May 29, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

