Ravindra Jadeja | టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టులకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్‌ను బట్టి తెలుస్తున్నది. జడేజా ఇన్స్టాగ్రామ్ వేదికగా టెస్ట్ జెర్సీని షేర్ చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులు ఆల్‌రౌండ్ రిటైర్మెంట్ గురించి హింట్స్ ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు యూజర్లు స్పందించారు. ఓ యూజర్ రిటైర్మెంట్కు సంకేతమా? అంటూ ప్రశ్నించగా.. మరొకరు శుభాకాంక్షలు తెలిపారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 క్రికెట్‌కు జడేజా రిటైర్మెంట్ ప్రకించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెత్త ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిద్దరంత కాకపోయినా జడేజాపై సైతం విమర్శలు వచ్చాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను టీమిండియా 1-3 తేడాతో ఓటమిపాలైంది. ఆసిస్ పర్యటనలో జడేజా మూడు మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్ల తీశాడు. 27 సగటుతో 135 పరుగులు చేశాడు.
సమాచారం మేరకు.. జడేజా ప్రదర్శనపై సైతం సెలెక్టర్లు దఋష్టి సారించారని.. సెలక్షన్ కమిటీతో బీసీసీఐ జడేజా భవిష్యత్‌పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జడేజా ఇకపై టెస్టుల్లో కొనసాగడం కష్టమేనని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్నారు. భారత్ ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20, మూడు వన్డేలు ఆడనున్నది. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి సైతం జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో సిరీస్, ఐసీసీ ఈవెంట్‌కు జడేజాను ఎంపిక చేస్తారా? లేదా? అన్ని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2027 వన్డే ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకొని సెలక్షన్ కమిటీతో పాటు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో జడేజాకు అవకాశం ఇవ్వాలా? యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలా? అన్న విషయంపై సెలెక్టర్లు చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది.
Ravindra Jadeja’s Instagram story. 🌟🇮🇳 pic.twitter.com/vacB7do0HB
— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025