న్యూఢిల్లీ: టీమ్ఇండియా ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ఐసిస్ కశ్మీర్ నుంచి రెండు మెయిల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరారు. ఈ నెల 22న గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఒక మంగళవారం మధ్యాహ్నం రాగా, మరొకటి అదేరోజు సాయంత్రం వచ్చింది. రెండిటిలోనూ ఐ కిల్ యూ (IKillU) అని ఉంది. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన ఢిల్లీలోని రాజింద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గంభీర్‌కు ఇలాంటి బెదింపులు రావడం ఇది మొదటిసారి కాదు. 2021, నవంబర్‌లో ఆయన ఎంపీగా ఉన్న సమాయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్ వచ్చింది. కాగా, మంగళవారం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని గంభీర్ ఎక్స్‌వేదికగా ఖండించారు. ఈ దాడిలో ఇప్పటివరకు 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే.