India vs Afghanistan Test | తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా
India vs Afghanistan Test | న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
హైదరాబాద్ : న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్(100), సెంచరీలు సాధించగామూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్(52) అర్ద శతకాలతో ఆకట్టుకున్నారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో చెలరేగాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలొక వికెట్ పడగొట్టారు. కాగా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై లభించిన అవకాశాన్ని యశస్వి జైస్వాల్సద్వినియోగం చేసుకోలేకపోయాడు.సఫీ బౌలింగ్‌లో (24) పరుగులకే వెనుదిరిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

