ICC on Team India | క్రికెట్లో ఆరేండ్ల తర్వాత టీం ఇండియా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆదివారం రాత్రి జరిగిన చివరి, మూడో టీ-20 మ్యాచ్‌లోనూ 17 పరుగుల తేడాతో టీం ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను పూర్తిగా వైట్‌వాష్ చేసింది. 2016 తర్వాత టీ-20లో టీం ఇండియా మొదటి స్థానంలో నిలవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఘనత టీం ఇండియా సారధి రోహిత్ శర్మకు దక్కింది. తర్వాత ఆరేండ్లకు టీ-20లో టీం ఇండియా పై చేయి సాధింంచింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం గతంలో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ ఉంది. కానీ ఈ దఫా ఆ రికార్డును టీం ఇండియా అధిగమించింది. టీం ఇండియా రేటింగ్ 269తో టాప్‌లో కొనసాగుతున్నది. ఇంగ్లండ్ రేటింగ్ కూడా 269గా ఉన్నా దాని పాయింట్లు వెనుకబడ్డాయి. టీం ఇండియా 10,484, ఇంగ్లాండ్ 10,474 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఇక పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాతీ ర్యాంక్‌లు కలిగి ఉన్నాయి.