Gautam Gambhir | భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఇటీవల మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ పాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. గౌతమ్ గంభీర్‌కు టీమిండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ మద్దతు ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జట్టులోని ఆటగాళ్లతో సంతోషంగా ఉన్నాడా? లేదా అనేది కోచ్ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. గంభీర్ పర్యవేక్షలో టీమిండియా రెండు కీలక టెస్టు సిరీస్‌లను కోల్పోయి.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగింది.
అయితే, వరుస ఓటములను మరిచిపోయి ముందుకు సాగాలని సూచించాడు. కోచ్‌ను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వాలని సూచించారు. కష్ట సమయాల్లో బాధ్యతలు తీసుకున్నాడని.. కొంచెం సమయం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వాలని చెప్పాడు. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం విజయవంతంగా ముగిసిందని.. ద్రవిడ్ ప్లేస్‌లోకి రావడం అంత తేలికైన విషయం కాదని కార్తీక్ పేర్కొన్నాడు. గంభీర్ సైతం విజయం సాధించాడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. టీ20 సిరీస్‌లో జట్టు విజయం సాధించిందని గుర్తు చేశాడు. యువ ఆటగాళ్లతో కలిసి పని చేశాడని.. గంభీర్‌కు ఆ సామర్థ్యం ఉందని తాను ఖచ్చితంగా చెప్పగలనని చెప్పాడు.
టెస్టుల్లో కష్టకాలం ఉందని.. ప్రస్తుత ఆటగాళ్లతో సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేది కీలకమని.. గంభీర్ ఆటగాళ్లను నిర్ణయాలు తీసుకునేలా ప్రభావితం చేయగలడా? టెస్ట్ జట్టు ఎలా ఉండాలి.. దానికి ఈ ఆటగాళ్లు సరిపోతారా? అన్నదానిపై అతని ఐడియాలజీ ఏంటీ?.. కాకపోతే ముందుకు సాగేందుకు ఉత్తమ మార్గం ఏంటో స్పష్టంగా గుర్తించాలని చెప్పాడు. శనివారం జరిగిన సమావేశంలో బీసీసీఐ ఆస్ట్రేలియా పర్యటనపై సమీక్షించిందని.. ఈ భేటీ రెండుగంటలకుపైగా కొనసాగిందని సమాచారం. ఈ సమావేశంలో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవ్జిత్ సైకియా పాల్గొన్నారు.