Sitanshu Kotak | ఇంగ్లాండ్‌తో జరిగే పరిమితి ఓవర్ల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సౌరాష్ట్ర మాజీ బ్యాట్స్‌మెన్ సితాన్షు కొటక్ నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఆయన ఇండియా-ఏ జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఇండియా-ఏ జట్టును గతేడాది నవంబర్‌లో పర్యటించింది. రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేకపోవడంతో ఆగస్టులో 2023లో ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. భారత జట్టు త్వరలోనే కీలకమైన సిరీస్‌లను ఆడనున్నది. ఈ నేపథ్యంలో సితాన్షు కొటక్‌ను కోచ్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు తెస్తున్నది. వాస్తవానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లలో భారత జట్టును ఓటమి పాలైంది.
ఆయా సిరీస్‌లలో భారత బ్యాట్స్‌మెన్స్ బ్యాటింగ్స్‌లో విఫలమయ్యారు. 52 సంవత్సరాల సితాన్షు కొటక్ చాలాకాలం పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. సీనియర్ జట్టుతో పాటు ఏ జట్లతో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లారు. ప్రస్తుత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌పై పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ఆటగాళ్లకు అభిషేక్ నాయర్ నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని తెలుస్తుందని.. సితాన్షు చాలాకాలంగా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారని.. ఆయనపై ఆటగాళ్లకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ లోపాలు బయటపడ్డాయి. విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్లే బంతులను వెంటాడి వికెట్‌ను సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ లోపాలను సరిచేసేందుకు ఓ బ్యాటింగ్ కోచ్ అవసరమని బీసీసీఐ భావించినట్లు తెస్తున్నది.
జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించనున్నది. దాంతో భారత ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడుతుందని భావిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఆ తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయికి వెళ్తుంది. ఈ ఐసీసీ ఈవెంట్ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్నది. ఇటీవల బీసీసీఐ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఓటమి సందర్భంగా గతవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి హాజరైన కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టుకు బ్యాటింగ్ కోచ్‌ను నియమించాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సితాన్షు కోటక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
సితాన్షు సౌరాష్ట్రకు చెందిన చెందిన మాజీ ఆటగాడు. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించారు. 1992-93 వరకు సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 8,061 పరుగులు చేయగా.. ఇందులో 15 సెంచరీలు, మరో 55 హాఫ్ సెంచరీలున్నాయి. ఆయన 41.76 యావరేజ్‌తో పరుగులు చేశారు. సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా చేశారు. రిటైర్మెంట్ తర్వాత కోచ్ అవతారం ఎత్తారు. సౌరాష్ట్ర హెడ్ కోచ్‌గా చేసి ఆ తర్వాత.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. నాలుగేళ్లుగా ఇండియా-ఏ జట్టు హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్నారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాకు పర్యటనల్లో భారత్-ఏ జట్టు కోచ్‌గా వ్యవహరించారు. ఐపీఎల్ 2017లో గుజరాత్ లయన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. గత టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోషేట్ సహాయక కోచ్‌లుగా, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా నియామకమయ్యాడు. టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.