వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరింది. ఆరు సంవత్సరాల తర్వాత టీమిండియా ఈ జాబితాలో తొలి స్థానానికి చేరింది. ఇప్పటి వరకు 269 రేటింగ్‌తో ఇంగ్లండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. విండీస్‌తో సిరీస్ విజయం తర్వాత భారత్ కూడా 269 రేటింగ్‌తో నిలిచింది.
అయితే పాయింట్ల ట్యాలీలో ఇంగ్లండ్ 10474 పాయింట్లతో ఉండగా.. భారత జట్టు 10484 పాయింట్లతో ఉంది. దీంతో భారత జట్టు అగ్రస్థానానికి చేరింది. ఈ జాబితాలో భారత్, ఇంగ్లండ్ తర్వాత 266 రేటింగ్ పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది. 255 రేటింగ్ పాయింట్లతో న్యూజిల్యాండ్, 253 రేటింగ్ పాయింట్లతో సౌతాఫ్రికా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా మాత్రం 249 రేటింగ్ పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 4-1తో గెలిచినా ఆస్ట్రేలియా ర్యాంకు మెరుగవలేదు. భారత్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచుల్లో పోరాడినప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన విండీస్ జట్టు ఏడోస్థానంలో ఉంది. మరికొన్నిరోజుల్లో శ్రీలంకతో భారత జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే.
A new team on top of the ICC @MRFWorldwide Men's T20I Rankings 👀
Details 👇https://t.co/fVOjhQo8J5
— ICC (@ICC) February 21, 2022