Team Europe | బెర్లిన్ (జర్మనీ): టెన్నిస్‌లో ప్రతిష్టాత్మక లేవర్ కప్ ట్రోఫీని టీమ్ యూరప్ సొంతం చేసుకుంది. స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కారజ్ సింగిల్స్‌తో పాటు డబుల్స్ విభాగంలోనూ సత్తాచాటి టీమ్ యూరప్‌నకు ఐదో లేవర్ కప్ ట్రోఫీని అందించాడు. తొలి సింగిల్స్‌లో అల్కారజ్.. 6-2, 7-5తో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. కానీ రెండో సింగిల్స్‌లో మెద్వెదెవ్ 7-6 (8/6), 5-7, 7-10తో ఓటమి పాలయ్యాడు.
మూడో సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-7 (5/7), 7-5, 10-5తో ఫ్రాన్సిస్ టియాఫోను ఓడించాడు. డబుల్స్ విభాగంలో అల్కారజ్-రూడ్ ద్వయం 6-2, 7-6 (8/6)తో టియాఫో-షెల్టన్‌ను ఓడించడంతో టీమ్ యూరప్ 13-11తో టీమ్ వరల్డ్‌ను ఓడించి టైటిల్ గెలిచింది.