హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ), అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ(ఏవైసీఏ) అండర్-17 వన్డే క్రికెట్ టోర్నీ ఈనెల 24 నుంచి మొదలుకానుంది. ఏవైసీఏ జట్టుతో టీడీసీఏ రూరల్ వారియర్స్, రూరల్ రైజర్స్, రూరల్ పాంథర్స్ జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీపడుతాయి.ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీలు, జెర్సీలను డీజీపీ జితేందర్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, అరుణ్, రామిరెడ్డి, పాల్గొన్నారు. మరోవైపు హర్యానాలో జరిగిన 73వ ఆలిండియా పోలీస్ వాలీబాల్ క్లస్టర్ పోటీల్లో తెలంగాణకు చెందిన పోలీసు క్రీడాకారులు మొత్తం 11 కాంస్య పతకాలను గెలుచుకున్నారు.