హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికా క్రికెట్ బోర్డు చైర్మన్ పీసీకే వేణు రెడ్డితో తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షులు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు.
తెలంగాణలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను యూఎస్ క్రికెట్ బోర్డు ముందుకురావాలని వేణును అల్లీపురం కోరారు. టీడీసీఏకు అవసరమైన సహకారం అందించే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వేణు తెలిపారు.