Asia Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్(Pakistan) ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. బ్యాటర్లు దంచి కొట్టడంతో భారత(Team India) ఏ జట్టు ముందు 353 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తయ్యబ్ తహిర్(108 ) విధ్వంసక సెంచరీకి తోడు ఓపెనర్లు సయిం అయూబ్(59), షహబ్జద ఫర్హాన్(65) అర్థ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో హంగర్‌గెకర్, రియాన్ పరాగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత జట్టు భారీ మూల్యం చెల్లించింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాక్ ఓపెనర్లు సయిం అయూబ్(59), షహబ్జద ఫర్హాన్(65) రెచ్చిపోయారు. వీళ్లు ఔటయ్యాక వచ్చిన తయ్యబ్ తహిర్(108 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
Tayyab Tahir’s belligerent ton and fifties from the opening duo power Pakistan Shaheens to 3️⃣5️⃣2️⃣-8️⃣ 🏏#ACCMensEmergingTeamsAsiaCup | #BackTheBoysInGreen pic.twitter.com/4B1HbD2gs3
— Pakistan Cricket (@TheRealPCB) July 23, 2023
భారత కెప్టెన్ యశ్ ధుల్ బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. సెంచరీ తర్వాత తయ్యబ్‌ను హంగర్‌గెకర్ ఔట్ చేయడంతో స్కోర్ వేగం తగ్గింది. అయితే.. చివర్లో ముబసిర్ ఖాన్(35), మొహమ్మద్ వసీం జూనియర్(17 నాటౌట్) ధాటిగా ఆడి స్కోర్ 350 దాటించారు.