WI vs BAN 1st Test : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ (West Indies) కష్టాల్లో పడింది. బంగ్లా పేసర్ తస్కిన్ అహ్మద్(2/19) ధాటికి ఆతిథ్య జట్టు ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(4)ను ఎల్బీగా వెనక్కి పంపిన తస్కిన్ లంచ్‌కు ముందు మరోసారి విజృంభించాడు. క్రీజులో కుదురుకునే పనిలో ఉన్న కేసీ కార్టీ(0)ని డకౌట్ చేశాడు. అంతే కరీబియన్ జట్టు ఒత్తిడిలో పడింది. లంచ్ సమయానికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌కు తస్కిన్ అహ్మద్ ఆదిలోనే బ్రేకిచ్చాడు. తొలి వికెట్‌కు 25 పరుగులు జోడించిన ఓపెనర్లను విడదీశాడు. క్రెగ్ బ్రాత్‌వైట్(4)ను ఔట్ చేసి విండీస్‌కు షాకిచ్చాడు.
Bangladesh never allowed the hosts to break free in a session of attrition
West Indies 50-2 at lunch on Day 1 in Antigua
Live: https://t.co/oAJoKs2wic | #WIvBAN pic.twitter.com/KkiWyjV467
— ESPNcricinfo (@ESPNcricinfo) November 22, 2024
ఆకాసేపటికే లంచ్ అనగా కేసీ కార్టీ(0)ని వెనక్కి పంపి ఆతిథ్య జట్టు కష్టాలను పెంచాడు తస్కిన్. అయితే.. మికిలే లూయిస్(36), కవెం హొడ్గే(10)లు ఆచితూచి ఆడుతున్నారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 25 పరుగులు జోడించారు.