WhatsApp | వాట్సాప్ కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ హాయిగా టెక్ట్స్‌గా చదువుకోవచ్చు..!
WhatsApp | వాట్సాప్ యూజర్లు పంపే వాయిస్ మెసేజ్ వినడానికి ఇబ్బందికరంగా ఉంటే టెక్ట్స్‌గా మార్చుకునేందుకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తోంది. చాలా మంది యూజర్లు సుదీర్ఘ విషయం చెప్పడానికి వాయిస్ మెసేజ్ ఫీచర్ వినియోగిస్తారు. ఈ వాయిస్ మెసేజ్‌ని నలుగురి మధ్యలో ఉన్నప్పుడు వినడం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటప్పుడు వినాలంటే ఇయర్ ఫోన్స్ ఉండాలి. అలా వీలు కాకుంటే సదరు వాయిస్ మెసేజ్ వదిలేయాల్సి ఉంటది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. వాయిస్ మెసేజ్.. టెక్ట్స్ రూపంలో చదువుకోవడానికి వీలుగా వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ (Voice Message Transcripts) ఫీచర్ తెచ్చింది.
ఈ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్ వినొచ్చు.. వినలేని పరిస్థితుల్లో ట్రాన్స్‌స్క్రిప్ట్ చేసుకుని టెక్ట్స్ రూపంలో చదువు కోవచ్చు. అలాగని అది ట్రాన్స్ లేటర్ కానేకాదు. వాయిస్ మెసేజ్ ఉన్న భాషలోనే టెక్ట్స్ వస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే వాయిస్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా కింద టెక్ట్స్ రూపం లభిస్తుంది. కేవలం మెసేజ్ అందుకున్న వారు మాత్రమే టెక్ట్స్ చూడగలరు తప్ప.. పంపిన వారు అలా టెక్ట్స్ మెసేజ్ కోసం ఈ ఫీచర్ వినియోగించలేరని వాట్సాప్ తెలిపింది.
ఆండ్రాయిడ్ వర్షన్లో ఇంగ్లీష్ తోపాటు పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలకు వాయిస్ మెసేజ్ ఫీచర్ మద్దతుగా ఉంటుంది. ఇక ఆపిల్ ఐఓఎస్ యూజర్లకు అదనంగా అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్ భాషల్లో ఈ ఫీచర్ అందుబాటుటో ఉంటుంది. మున్ముందు ఇతర భాషల్లోకి విస్తరించనున్నది. వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవడానికి వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ చాట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో కనిపించే వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఆప్షన్ ఆన్ / ఆఫ్ చేసుకోవడంతోపాటు భాషను కూడా ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యూజర్లకు సపోర్ట్ లేని భాష, పదాలను గుర్తించలేకపోతే ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఎర్రర్ వస్తుందని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ రోల్ ఔట్ చేసిన ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

