Champions Trophy 2025 | ఐసీసీ అత్యవసర సమావేశం.. దాయాది బోర్డుల మధ్య సయోధ్య కుదిరేనా..?
Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అటు బీసీసీఐ, ఇటు పీసీబీలు పంతం వీడడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ అత్యవసర సమావేశం నిర్వహించాలి అనుకుంటోంది.
Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఆడేందుకు సిద్ధంగా లేకపోవడంతో పాటు హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ససేమిరా అంటుండమే అందుకు కారణం. దాంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి నవంబర్ 11న జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను కూడా రద్దు చేసింది.
అయినా సరే అటు బీసీసీఐ, ఇటు పీసీబీలు పంతం వీడడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ అత్యవసర సమావేశం నిర్వహించాలి అనుకుంటోంది. చాంపియన్స్ ట్రోఫీ వేదిక ఖరారు చేయడమే కాకుండా దాయాది బోర్డులను ఒప్పించడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగనుంది.

చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ సిద్దమవుతోంది. నవంబర్ 26న జరుగబోయే అత్యవసర సమావేశంలో పీసీబీ, బీసీసీఐల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐసీసీ ప్రతినిధులు ప్రయత్నించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఐదు అంశాలపై చర్చించే వీలుంది.
1. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎక్కడ జరపాలి? ఇతర గ్రూప్ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలి?
2. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను తటస్థ వేదికపై జరపడం.
3. పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించని పక్షంలో ఏం చేయాలి?
4. చాంపియన్స్ ట్రోఫీని మొత్తానికే పాకిస్థాన్ నుంచి తరలించడం.
5. పాకిస్థాన్ జట్టు లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం.

చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్‌కు బీసీసీఐ షాకిచ్చింది. భద్రతా కారణాలరీత్యా పాక్ గడ్డకు జట్టును పంపబోమని ఐసీసీకి స్పష్టం చేసింది. ఇదే విషయాన్నిపీసీబీకి ఐసీసీ తెలియజేసింది కూడా. అయినా సరే తమకు రాత పూర్వక ఆధారం కావాలంటూ పీసీబీ మొండి పట్టు పడుతోంది.
అంతేకాదు ఐసీసీ సూచించినట్టు హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ అంగీకరించడం లేదు. పీసీబీ అలానే మొండికేస్తే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ సిద్దంగా ఉంది. అదే జరిగితే మెగా టోర్నీ ఆతిథ్యం కింద పీసీబీకి కేటాయించిన రూ.548 కోట్లు హుష్‌కాకి అయినట్టే.
ఇవి కూడా చదవండి
- ACC | సోనీ టీవీకి ఆసియా కప్ మీడియా హక్కులు.. ఎంత మొత్తానికో తెలుసా..?
- Watch: స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
- MLC Kavitha | త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక : ఎమ్మెల్సీ కవిత
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

