చత్తోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 రన్స్ తేడాతో విజయం నమోదు చేసింది. చత్తోగ్రామ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. చేజింగ్ చేస్తున్న సమయంలో బంగ్లా బ్యాటర్ తస్కిన్ అహ్మాద్(Taskin Ahmed ) భారీ షాట్ కొట్టాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో అతను వెనక్కి అడుగు వేసి బంతిని హుక్ షాట్ ఆడాడు. తస్కిన్ పవర్‌కు ఆ బంతి సిక్సర్‌గా వెళ్లింది. కానీ ఆ సిక్సర్ తన ఖాతాలోకి రాలేదు. అంపైర్ తస్కిన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. బంతి బౌండరీ దాటినా.. తస్కిన్ మాత్రం షాట్ కొట్టే ప్రయత్నం తన కాలుని వికెట్లకు తాకించాడు. దీంతో ఓ బెయిల్ కింద పడింది. ఫలితంగా తస్కిన్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. తస్కిన్‌ను హిట్ వికెట్‌గా తేల్చారు.
When you think you’ve won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ
— FanCode (@FanCode) October 27, 2025
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కెప్టెన్ షై హోప్ (46*), రొవ్మన్ పావెల్ (44*) దూకుడుగా ఆడటంతో 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. ఛేదనలో బంగ్లా 19.4 ఓవర్లలో 149 రన్స్‌కే కుప్పకూలింది.