మకావు: భారత యువ షట్లర్ ఆయుష్శెట్టి, హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి మకావు ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఆయుష్.. 21-10, 21-11తో హువాంగ్ యు కై (చైనీస్ తైఫీ)పై అలవోక విజయం సాధించాడు. తరుణ్.. 21-19, 21-13తో భారత్‌కే చెందిన మన్రాజ్ను ఓడించాడు. స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. 21-8, 21-14తో జియోన్ (దక్షిణ కొరియా)ను చిత్తుచేశాడు.
మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్.. 21-18, 15-21, 16-21తో ఇండోనేషియా షట్లర్ మర్సిల్లినొ చేతిలో ఓడగా కిరణ్ జార్జి, శంకర్ సుబ్రహ్మణ్యన్, కరుణాకరన్ తొలి రౌండ్‌కే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో రక్షిత రామ్రాజ్ ప్రిక్వార్టర్స్‌కు చేరగా ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా, అన్మోల్ ఖర్బ్, అనుపమ ఉపాధ్యాయ.. మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.