మకావు : మకావు బ్యాడ్మింటన్ ఓపెన్‌లో తెలంగాణ యువ షట్లర్ మన్నెపల్లి తరుణ్ పోరాటం ఆదిలోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తరుణ్ 22-24, 15-21తో డాంగ్ తియాన్ యావో(చైనా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 44 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తరుణ్.. ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. తొలి గేమ్‌లో చైనా షట్లర్‌తో హోరాహోరీగా తలపడ్డ తరుణ్.. రెండో గేమ్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయాడు.
ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ యువ షట్లర్ మకావు టోర్నీలో ముందంజ వేయలేకపయాడు. మిగతా మ్యాచ్‌ల్లో అశ్మిత చాలిహ 22-20, 21-15తో ఇషికా జైస్వాల్(అమెరికా) చేతిలో ఓడగా, రౌనక్ చౌహాన్ 13-21, 17-21తో హు జా(చైనా), శ్రియాంశి వలిశెట్టి 16-21, 16-21తో కిమ్ మిన్ జి(కొరియా) పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించారు.