వైరా టౌన్, జూలై 24 : ప్రజాసేవకే కేటీఆర్ జీవితం అంకితమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావ్, బాణాల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం వైరా మధిర రోడ్ లో స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద లోతుగా ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చి శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత మండలంలో రెండు సంవత్సరాలుగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గుంతలను పూడ్చి వేసినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోతే దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దెల రవి, లకావత్ గిరిబాబు, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, 11వ వార్డు కౌన్సిలర్ దొంతేబోయిన వెంకటేశ్వర్లు, వల్లాపురం ఉప సర్పంచ్ వేల్పుల నారాయణ, లాల్ మహమ్మద్, మిట్టపల్లి సత్యం బాబు, తిరుపతి శ్రీను, మిట్టపల్లి కిరణ్ కుమార్, మరికంటి శివ, కొల్లా రాంబాబు, నూకల ప్రసాదు, ఏదునూరు శ్రీనివాసరావు, వేముల శివ, కందుల ఓంకార్, బొడ్డు రామకృష్ణ, సింగవరపు నరేష్, అనంత వెంకటేశ్వర్లు, మడుపల్లి కృష్ణ, మాచర్ల శంకర్, వీరన్న, అప్పారావు, వల్లేపు రాము, ముదిగుండ్ల పుల్లయ్య పాల్గొన్నారు.

వైరాలో బీఆర్ఎస్ శ్రేణుల శ్రమదానం