గువహతి : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో మూడో రోజూ భారత్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. యువ షట్లర్లు తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు బాయ్స్ సింగిల్స్‌లో జ్ఞాన దత్తు ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లలో తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నారు.
గువహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న ఈ పోటీల ఉమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ తన్వి.. 15-8, 15-5తో సున్ లి యున్ (చైనా)ను చిత్తుచేసి తన జోరు కొనసాగించింది. మరో పోరులో ఉన్నతి.. 15-10, 15-7తో కరైనా (మలేషియా)ను ఓడించింది. బాయ్స్ సింగిల్స్‌లో జ్ఞాన దత్తు.. 15-12, 15-13తో గారెట్ టాన్ (యూఎస్ఏ)ను మట్టికరిపించి క్వార్టర్స్ చేరుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్‌లో భవ్య-విశాఖ ద్వయం.. 12-15, 15-11, 15-12తో మూడో సీడ్ ఫ్రాన్స్ జోడీ తిబాల్ట్ గార్డన్-అగతె క్యూవస్కు షాకిచ్చింది.