లోవా (అమెరికా) : బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు తన్వి శర్మ, ఆయుష్ శెట్టి విజయవంతమైన ప్రదర్శన కొనసాగుతున్నది. టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ సెమీస్ చేరిన ఈ ఇద్దరూ.. ఆదివారం జరిగిన సెమీఫైనల్లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు.
మహిళల సింగిల్స్ సెమీస్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన 16 ఏండ్ల తన్వి శర్మ.. 21-14, 21-16తో ఉక్రెయిన్‌కు చెందిన ఏడో సీ డ్ పొలిన బహ్రొవను మట్టికరిపించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ఆయుష్.. 21-23, 21-15, 21-14తో ప్రపంచ ఆరో ర్యాంకర్ అయిన చౌ టైన్ చెన్ (చైనా)కు షాకిచ్చాడు.