కావ్లున్(హాంకాంగ్): హాంకాంగ్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత ద్వయం తనీషా క్యాస్ట్రో, అశ్విని పొనప్ప ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పోరులో తనీష, అశ్విని జోడీ 21-19, 21-19 తేడాతో చైనీస్ తైపీ ద్వయం లీ చియాసిన్, టెంగ్ చున్ సన్‌పై అద్భుత విజయం సాధించింది.
మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 21-14, 21-12తో జాంగ్యి మన్(చైనా)పై గెలిచింది. వేర్వేరు మ్యాచ్‌ల్లో సుమిత్‌రెడ్డి, అశ్విని ద్వయం ఓటములు ఎదుర్కొన్నారు.