హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ దుమ్మురేపింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 44-25తో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో మూడో గెలుపుతో తలైవాస్..పాయిట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తలైవాస్ తరఫున స్టార్ రైడర్ నరేందర్ 15 పాయింట్లతో అదరగొట్టగా, సచిన్(5 పాయింట్లు), నితేశ్‌కుమార్(4), ఆమీర్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు గుజరాత్ జట్టులో గుమన్‌సింగ్(7), రాకేశ్(3) రాణించారు. ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన తలైవాస్..గుజరాత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 30-28తో యూపీ యోధాస్‌పై గెలిచింది.