హైదరాబాద్, ఆట ప్రతినిధి: టాపార్డర్ రాణించడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తమిళనాడు భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 203/0తో గురువారం మూడో రోజు ఆట కొనసాగించిన తమిళనాడు.. 510/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాయి సుదర్శన్ (179), నారాయణ్ (116), బాబా అపరాజిత్ (115*) సెంచరీలతో కదంతొక్కారు. మన బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.