హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తల్లూరి నయనశ్రీ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్ వేదికగా జరిగిన పోటీల్లో అండర్-15 విభాగంలో నయనశ్రీ అగ్రస్థానం దక్కించుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన తెలంగాణ స్కేటర్లు ఈ చాంపియన్షిప్లో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలతో సత్తాచాటారు. కృతి రాజ్, తేజ్ అభినందన్, సమర్వీర్సింగ్, ప్రణవ్ మాధవ్, మయాంక్ శ్రీ, విష్ణు వర్ధన్, గీతిక, శాన్వి సింగ్, శ్రీనెజ పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తం 10 పతకాలు ఖాతాలో వేసుకున్న తెలంగాణ ఓవరాల్ చాంపియన్షిప్లో రెండో స్థానం దక్కించుకుంది. పతకాలు సాధించిన స్కేటర్లను సాట్స్ కోచ్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ అబినందించారు.