మారేడ్‌పల్లి, అక్టోబర్ 3: క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతోనే.. రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్‌తో కలిసి సాట్స చైర్మన్ మంగళవారం ‘తలసాని చాలెంజ్ కప్’ పేరిట రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా గ్యాస్ మండిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.