BAN vs ZIM : స్వదేశంలో జింబాబ్వేతో జరగుతున్నరెండో టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) పట్టుబిగిస్తోంది. తొలి టెస్టులో అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న బంగ్లా.. తైజుల్ ఇస్లాం(5-60) విజృంభణతో జింబాబ్వేను సమర్థంగా కట్టడి చేసింది. టాస్ గెలిచిన పర్యటక జట్టుకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్(21), బెన్ కర్రాన్(21)లు శుభారంభం ఇవ్వగా.. జింబాబ్వే స్కోర్ దూసుకెళ్లింది.
అయితే.. బెన్నెట్‌ను ఔట్ చేసిన తంజిమ్ హసన్ బంగ్లాకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత నిక్ వెల్చ్(54), సీన్ విలియమ్స్(67)లు అర్ధ శతకాలతో చెలరేగి ఆతిథ్య జట్టు బౌలర్లను అలిసిపోయేలా చేశారు. దాంతో, టీ సమయానికి 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన పర్యాటక జట్టు పటిష్ట స్థితిలో ఉంది. అయితే.. ఆ తర్వాత సీన్ మారిపోయింది.
Most five-wicket hauls for Bangladesh in Tests:
Shakib Al Hasan – 19
𝗧𝗮𝗶𝗷𝘂𝗹 𝗜𝘀𝗹𝗮𝗺 – 𝟭𝟲
Mehidy Hasan Miraz – 12#BANvZIM pic.twitter.com/AJg9ZB2a0Q— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025
టీ సెషన్ తర్వాత మళ్లీ బంతి అందుకున్న తైజుల్ ఇస్లాం(5-60) జింబాబ్వేను గట్టి దెబ్బకొట్టాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విజృంభణతో ఆఖరి సెషన్లో అనూహ్యంగా 7 వికెట్లు కోల్పోయింది. ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరిన వేళ వికెట్ కీపర్ తఫజ్వా స్సిగా(18 నాటౌట్), బ్లెస్సింగ్ ముజరబని(2 నాటౌట్)లు ఆలౌట్ ప్రమాదాన్ని తప్పించారు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయి 227 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో నయీం హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు.