Bala Krishna | 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం (ఏప్రిల్ 28) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సినిమా రంగానికి గాను విశేష సేవలు అందించిన ప్రముఖులకి ప్రతిష్టాత్మక అవార్డులు అందించారు. ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా బాలయ్య పద్మ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. కొడుకు, కూతుళ్లు, అల్లుళ్లతో కలిసి బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపికైన బాలయ్య, రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించారు. 110కి పైగా చిత్రాల్లో నటించడంతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న క్రమంలో బాలయ్యకి ఈ అవార్డ్ దక్కింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని, భార్య వసుందర, మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు.కోలీవుడ్ హీరో అజిత్‌కి సైతం పద్మ విభూషణ్ అవార్డ్ అందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
పద్మ పురస్కారానికి ఎంపికైన సమయంలో అజిత్ భావోద్వేగానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ శుభవార్తని వినేందుకు నా తండ్రి ఉండి ఉంటే బాగుండు అని అజిత్ కాస్త ఎమోషనల్ అయ్యారు.సినీ రంగంలోనే కాకుండా రేసింగ్లోను అజిత్ కి ప్రావీణ్యం ఉంది. కాగా, జనవరి 25న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2025 పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 139 మంది ఈసారి అవార్డుల కోసం ఎంపికయ్యారు. వీరిలో 113 మందికి పద్మశ్రీ, 19 మందికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి.
Happy Tears 🥹🥹🥹💥💥🙏🏻🙏🏻🙏🏻
Telugu Pride Padmabhushan Balayya Babu🦁🦁🦁🔥🔥🔥👑👑#PadmabhushanNBK pic.twitter.com/Ja9xGKpXKb
— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) April 28, 2025
King has been Crowned #PadmabhushanAjithKumar pic.twitter.com/czJslPNwHp
— Adhik Ravichandran (@Adhikravi) April 28, 2025
AK #PadmabhushanAjithKumar pic.twitter.com/lnf8IgEedO
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) April 28, 2025