చెన్నై: టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఏ శరత్ కమల్(Sharath Kamal).. తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. చెన్నైలో ఈ నెల చివరలో జరగనున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీనే చివరిదని ప్రకటించాడు. ప్రొఫెషనల్ అథ్లెట్‌గా చివరి టోర్నమెంట్ ఆడనున్నట్లు శరత్ కమల్ తెలిపాడు. సుమారు రెండు దశాబ్ధాల పాటు టేబుల్ టెన్నిస్ క్రీడలో.. టాప్ ఇండియన్ ప్లేయర్‌గా శరత్ కమల్ తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. చెన్నైలో మార్చి 25 నుంచి 30వ తేదీ వరకు వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ జరగనున్నది.
నా తొలి అంతర్జాతీయ టోర్నీని చెన్నైలోనే ఆడానని, ఇక నా చివరి అంతర్జాతీయ టోర్నీని కూడా చెన్నైలో ఆడనున్నట్లు శరత్ కమల్ చెప్పాడు. ఇదే తన చివరి ప్రొఫెషనల్ టోర్నీ అని 42 ఏళ్ల టీటీ ప్లేయర్ స్పష్టం చేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ ఆరు బంగారు పతకాలు గెలిచాడు. ఇక ఏషియన్ గేమ్స్‌లో రెండు సార్లు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. గత ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ శరత్ కమల్ పాల్గొన్నాడు. అతను అయిదు సార్లు ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో సాధించిన పతకాలు తన వద్ద ఉన్నాయని, కానీ ఒలింపిక్ మెడల్ లేదన్నాడు. టేబుల్ టెన్నిస్ కెరీర్‌ను ఎంచుకున్న యువత రాబోయే కాలంలో ఒలింపిక్ మెడల్ గెలువాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో శరత్ కమల్ 42వ స్థానంలో ఉన్నాడు. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకారం భారత్‌లో హయ్యెస్ట్ ర్యాంక్ ప్లేయర్ శరత్ కమలే.
Watch: India’s most celebrated paddler Achanta Sharath Kamal has announced his retirement from table tennis with the upcoming WTT (World Table Tennis) Star Contender in Chennai set to be his last outing. pic.twitter.com/HTlYkCRRd1
— IANS (@ians_india) March 5, 2025