T20 world cup WI vs UGA : పొట్టి ప్రపంచకప్‌లో భారీ సిక్సర్ నమోదైంది. వెస్టిండీస్ టీమ్ కెప్టెన్ రోవ్మాన్ పొవెల్ ఈ రికార్డు సిక్స్ బాదాడు. ఆదివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో పొవెల్ రికార్డ్ సిక్స్ కొట్టాడు. పొవెల్ కొట్టిన సిక్సర్ ఏకంగా 107 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఉగాండా బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా.. తన తొలి బంతిని ఆఫ్ స్పిన్ డెలివరీగా సంధించాడు.
ఈ బంతిని ఉగాండా బౌలర్ రొవ్‌మాన్ పొవెల్ ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి అద్భుతంగా ఆడాడు. లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. దాంతో అందరూ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకుముందు భారీ సిక్సర్ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 105 మీట్లర్ల భారీ సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌లో పొవెల్ 107 మీటర్ల సిక్స్ బాదడంతో సాల్ట్ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌లో ఉగాండాపై వెస్టిండీస్ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది.
విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోసెఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫర్డ్ తలా ఒక వికెట్ తీశారు. ఉగాండా బ్యాటర్లలో జుమా మియాగీ (13) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది.