T20 World Cup 2026 : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక పురుషుల పొట్టి ప్రపంచకప్ టోర్నీ నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఇప్పటికే ఇరుదేశాల్లో కలిపి8 నగరాలను ఎంపిక చేసింది. తాజాగా టోర్నీలో ఆడనున్న 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా చేసింది ఐసీసీ. ఆతిథ్య జట్లైన టీమిండియా, శ్రీలంక గ్రూప్ దశలో కఠిన ప్రత్యర్ధులతో తలపడనున్నాయి. ఈసారి కూడా దాయాదులైన భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండడంతో మరో ఉత్కంఠ పోరుకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పొట్టి వరల్డ్ కప్ నిర్వహణ పనుల్లో వేగం పెంచింది ఐసీసీ. టోర్నీకి సమయం దగ్గరపడుతున్నందున వేదికలను ఖరారు చేసిన ఐసీసీ శనివారం 20 జట్లను గ్రూప్‌లుగా విభించింది. ఒక్కదాంట్లో ఐదు చొప్పున నాలుగు గ్రూప్‌లను చేసింది. ఆతిథ్య దేశమైన టీమిండియా గ్రూప్‌లో పాకిస్థాన్ మాత్రమే పెద్ద జట్టు. కానీ, శ్రీలంక గ్రూప్‌లో ఆస్ట్రేలియా ఉండడంతో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఇక గ్రూప్ 3లో ఇంగ్లండ్, వెస్టిండీస్.. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టెస్టు క్రికెట్ ఆడే జట్లు ఉన్నాయి.
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.
Groups for the 2026 T20 World Cup.
Some really interesting groupings. 👀
Source: Cricbuzz#T20WorldCup #AssociateCricket #CricketEverywhere pic.twitter.com/TsLpdKLVha
— Associate Chronicles (@AssociateChrons) November 22, 2025
భారత్, న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్‌లో జనవరి 21న తొలి టీ20 జరుగనుంది. రాయ్‌పూర్‌లో 23న రెండో మ్యాచ్, గువాహటిల్ జనవరి 25న మూడో టీ20, వైజాగ్‌లో జనవరి 28న నాలుగో మ్యాచ్, చివరిదైన ఐదో టీ20 జనవరి 31న త్రివేండ్రంలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ముగియగానే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో స్క్వాడ్‌ను ప్రకటించనున్నారు సెలెక్టర్లు.

ఆతిథ్య దేశాలైన భారత్‌లో ఐదు, లంకలోని రెండు నగరాలను ఎంపిక చేసింది ఐసీసీ. అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై.. శ్రీలంకలో కొలంబో, క్యాండీ సిటీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. సెమీఫైనల్స్ కోసం ఒకటి కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాలను ఆడించాలని షార్ట్ లిస్ట్ చేశామని ఐసీసీ తెలిపింది. అయితే.. ముంబైలోని వాంఖడే స్టేడియం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడించడంపై పాక్ బోర్డు, బీసీసీఐ మధ్య అంగీకారం కుందిరింది. ఒకవేళ పాక్ టీమ్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్‌లో కాకుండా మ్యాచ్ నిర్వహించడం ఖాయం. అక్టోబర్ 17న ప్రకటించనట్టే ఈసారి కూడా 20 జట్లతో టోర్నీని నిర్వహించనున్నారు. టోర్నీకి అర్హత సాధించిన జట్లను ఏ గ్రూప్‌లో ఉంచాలి? ఏ మ్యాచ్‌లు ఎక్కడ ఆడించాలి? అనే వివరాల్ని కూడా త్వరలోనే ఐసీసీ ప్రకటించనుంది.